సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను విడుదల చేయాలని కోరుతూ శశిథరూర్‌ ఆన్‌ లైన్‌లో పిటిషన్ సైన్‌ చేశారు. మూడు రోజుల క్రితం చిదంబరం కోసం విజయ్ రాంథాస్ అనే అతను పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై మూడు రోజుల్లోనే 4వేల మంది సంతకాలు చేశారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని అరెస్ట్ చేసి నెలవుతున్నా కనీసం చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదంటూ ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. శశిథరూర్‌ ట్విటర్‌లో చిదంబరం కోసం పిటిషన్ వేశారు . ఇతరులు కూడా వేయాలంటూ ఆయన ట్విట్ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.