ఐఎన్‌ఎక్స్ కేసులో చిదంబరానికి ఊరట..బెయిల్ మంజూరు..!
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 22 Oct 2019 11:53 AM IST

న్యూఢిల్లీ: చిదంబరం హమ్మయ్యా అనికుని ఉంటాడు. ఐఎన్‌ఎక్స్ కేసులో ఆయనకు పెద్ద రిలీఫే దొరికింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ మంజూరైంది. సర్వోన్నత న్యాయస్థానం ఈ కాంగ్రెస్ సీనియర్ నేతకు బెయిల్ మంజూరు చేసింది. చిదంబర్ అరెస్ట్ అయి రెండు నెలలు అవుతుంది. రెండు నెలలపాటు ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. రెండు మాసాల తరువాత ఆయనకు బెయిల్ రావడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో ఐఎన్‌ఎక్స్ కేసులో కస్టడీలో ఉండటంతో ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆగస్ట్ 21 సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసింది. గోడ దూకి మరీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేశారు.
Next Story