ఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్ట్ కొట్టేసింది. బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ న్యాయవాదులు వాదించారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే వాదనను ధర్మాసనం సమర్ధించింది. దీంతో చిదంబరానికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్ట్ నిరాకరించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మిస్ అయ్యాయని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చాలా రోజుల క్రితమే కోర్టుకు తెలిపారు. చిదంబరం ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.