చికెన్, మటన్ షాపులు బంద్
By సుభాష్ Published on 3 May 2020 11:56 AM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. ఏపీలో మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.
ఈ నే పథ్యంలో విజయవాడతో పాటు శివార్లలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం విజయవాడ నగరంలోని అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్‌లను మూసివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చేపల మార్కెట్, చికెన్, మటన్ షాపులు బంద్ చేశారు.
Next Story