క‌రోనాతో చెస్ట్ ఆస్ప‌త్రి హెడ్ న‌ర్సు మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 1:28 PM GMT
క‌రోనాతో చెస్ట్ ఆస్ప‌త్రి హెడ్ న‌ర్సు మృతి

కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా పోరాటం చేస్తున్న వారిలో వైద్య సిబ్బంది ముందుఉన్నారు. కాగా.. కరోనా బారీన పడుతున్న వైద్య సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆమె ఎందరో కరోనా బాధితులను కాపాడింది. విధి నిర్వహణలో భాగంగా కరోనా రోగులకు సేవలందించింది. మరో నాలుగు రోజుల్లో పదవి విరమణ చేయాల్సిన హెడ్‌ నర్సు కరోనాతో మృతి చెందింది.

హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో హెడ్‌ నర్సుగా సేవలు అందిస్తోన్న హెడ్‌ నర్సు 20 రోజుల క్రితం వరకు కరోనా రోగులకు సేవలు అందించింది. ఈక్రమంలో ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆస్పత్రిలోనే ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా.. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మరోవైపు ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో.. హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక్కడ మరొక విషాదం ఏమిటంటే ఈ నెల 30న ఆమె హెడ్‌ నర్సుగా పదవీ విరమణ చేయనున్నారు.

Next Story
Share it