ఆర్ పీ ఎఫ్ జాగిలం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2019 5:24 AM GMT
ఆర్ పీ ఎఫ్ జాగిలం..!

రన్నింగ్ రైలు ఎక్కడం, ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయటం లాంటివి చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. అనౌన్స్మెంట్ కూడా వింటూనే ఉంటాం. అయితే అవసరం కోసమో, సరదా కోసమో ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. అయితే ఇలాంటి వాళ్లని హెచ్చ్చరిస్తోంది ఓ శునకం. ప్రయాణికులకు తన భాషలో జాగ్రత్తలు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక పెంపుడు కుక్క తన యజమానిని వదిలి దారితప్పి చెన్నై నగరంలోని పార్క్ టౌన్ రైల్వే స్టేషను చేరుకుంది.

యజమాని దొరకకపోవడంతో రైల్వే రక్షకదళ పోలీసులు దీనిని పెంచుకుంటున్నారు. అయితే ఈ కుక్క పోలీసులకు కృతజ్ఞతతో ఆర్ పీ ఎఫ్ తో కలిసి పని చేయడం మొదలు పెట్టింది. రైలు లో ఫుట్ బోర్డు లో నిలబడి ప్రయాణం చేస్తున్నా, రన్నింగ్ రైలు ఎక్కినా దిగినా, ప్లాట్ఫారం మారేందుకు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను హెచ్చరిస్తూ కుక్క మొరుగుతోంది. ప్రయాణికుల భద్రతకు రైల్వే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ఈ జాగిలం కూడా అదేవిధంగా రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే చాలు వారివైపు కోపంగా చూస్తూ మొరగడం తో ప్రయాణికులను అప్రమత్తం అవుతున్నారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల భద్రత కోసం పని చేస్తున్న ఈ జాగిలం ఇప్పుడు సెలబ్రిటీగా మారింది.Next Story