కరోనా సోకి వైద్యుడు చనిపోతే..స్మశాన వాటిక బయట ఇలా..

By రాణి  Published on  13 April 2020 5:32 PM GMT
కరోనా సోకి వైద్యుడు చనిపోతే..స్మశాన వాటిక బయట ఇలా..

కరోనా వైరస్ సోకి పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నెల్లూరుకు చెందిన వైద్యుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతి చెందారు. కాగా..సదరు ఆస్పత్రి సిబ్బంది మృతదేహానికి కనీస దహన సంస్కారాలు నిర్వహించకుండా అమానవీయంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాధిత వైద్యుడి మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లో అంబత్తూర్ స్మశాన వాటిక బయటే పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Also Read : నెల్లూరులో తొలి కరోనా మరణం..వైద్యుడి నుంచి ముగ్గురికి కరోనా

కరోనాతో ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ మృతదేహానికి సొంత బంధువులు దహన సంస్కారాలు చేసే అవకాశం గానీ, ఆఖరి చూపులకు గానీ నోచుకునే అదృష్టం కానీ లేవు. చనిపోయిన మృతదేహం ద్వారా కూడా వైరస్ వ్యాపించడమే ఇందుకు కారణం. అలాగే లాక్ డౌన్ కారణంగా కరోనా మృతుడిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించే అవకాశమూ లేదు. అందులోనూ వైద్యుడి భార్య, కొడుకు, డ్రైవర్ తో పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్ కు కూడా వైరస్ సోకింది. కానీ..ఎంత కరోనాతో మృతి చెందితే మాత్రం మరీ మృతదేహాన్ని అలా అనాధ శవంలా బయటపడేస్తారా అంటూ విమర్శలొస్తున్నాయి. ఇలా మృతదేహానికి కనీస అంత్యక్రియలు నిర్వహించకుండా వదిలేసి వెళ్లిపోవడం వల్ల ఆ డెడ్ బాడీ నుంచి మరికొంతమందికి కూడా వైరస్ వ్యాపించే ప్రమాదముంది.

Also Read : ముంబైలో కరోనా కరాళ నృత్యం..ఒక్కరోజే 150 కేసులు

Next Story