శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు

By రాణి  Published on  6 March 2020 9:14 AM GMT
శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు

బాలీవుడ్ దంపతులు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై చీటింగ్ కేసు నమోదైంది. ఒక ఎన్నారై తనను వీరిద్దరూ మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేసుకున్నారు. శిల్పాశెట్టి దంపతులు నడిపిస్తున్న సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ తనను గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం చేసిందని ముంబైకి చెందిన సచిన్ జోషి అనే ఎన్నారై ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరితో పాటు..గణపతి చౌదరి, మహ్మద్ సైఫీ, ఇతరుల పేర్లను కూడా ఎన్నారై బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2014 మార్చిలో సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టిన సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ కింద 5 సంవత్సరాల వ్యవధిలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు అతను తెలిపాడు. కానీ..గడువు ముగిసిన తర్వాత రిడీమ్ ఇవ్వకుండా తనను మోసం చేశారని ఎన్నారై పోలీసుల ఎదుట వాపోయాడు. ఎన్నారై గోడు విన్న పోలీసులు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే శిల్పాశెట్టి అద్దె గర్భం ద్వారా ఆడబిడ్డకు తల్లైంది.

https://telugu.newsmeter.in/nene-naa-first-look/

Next Story
Share it