ఛత్తీస్‌గఢ్‌: కబీర్‌ధామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో జుగ్నివి అనే మహిళా మావోయిస్ట్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్ట్‌పై రెండు లక్షలు రివార్డ్ ఉన్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ఉదయం 10.30కు జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఓ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.