బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ.. భవనం పై నుంచి పడి యువతి మృతి
By Newsmeter.Network Published on : 14 Jan 2020 8:24 PM IST

శంషాబాద్ : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ మూడంతస్థుల భవనం పై నుంచి పడి ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని మృతి చెందింది. ఈ ఘటన
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే... కర్నాటక ముదుళికి చెందిన ఇమ్రాన్ అనే యువతి ఎయిర్ పోర్ట్ లో కస్టమర్ సర్వీసెస్ లో పని చేస్తోంది. శంషాబాద్ లో తాను నివసిస్తున్న భవంతి పై నేడు బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పై నుంచి కింద పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాని మార్చరీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story