లీడ‌ర్‌కు, మానిప్యులేట‌ర్ కు తేడా అదే: విజ‌య‌సాయిరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 10:01 AM GMT
లీడ‌ర్‌కు, మానిప్యులేట‌ర్ కు తేడా అదే: విజ‌య‌సాయిరెడ్డి

ఎప్పుడూ ట్విట్ట‌ర్ లో చురుగ్గా ఉండే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. వేత‌నాల సంగ‌తెలా ఉన్నా ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును ప్ర‌భుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్ల‌కు పెంచ‌మ‌ని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ ప‌డితే జీతాలే దండ‌గ అంటూ చంద్ర‌బాబు హేళ‌న చేశార‌ని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ సెప్టెంబ‌ర్ 1 నుంచి రిటైర్మెంట్ వ‌య‌సును పెంచి మాన‌వ‌తా థృక్ఫ‌దాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. లీడ‌ర్ కు మానిప్యులేట‌ర్ కు తేడా ఇదేనని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.Next Story
Share it