చంద్రబాబుపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Sept 2019 3:57 PM ISTవైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడ్డారు. వాలంటీర్ల పేరు వింటేనే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అన్నారు. ఐదువేల రూపాయల జీతంతో గోనె సంచులు మోయిస్తున్నారని, గ్రామ వాలంటీర్లు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై ఆయన ఘాటుగా స్పందించారు.
లోకేష్ లీలలు ప్రజలకు తెలుసునని, అలాంటి వాడినే దొడ్డిదారిన ఎమ్మెల్సీ ని చేశారన్నారు. మంచి పిల్లల పై నిందలు వేయడం సరికాదని హితవు చెప్పారు
అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి టిడిపి నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. సంస్థలను దివాలా తీయించి, జీతాలు సైతం ఇచ్చుకోలేని పరిస్థితుల్లోకి నెట్టేసి ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారని అన్నారు. ఆర్టీసీ విలువైన భూములను తన వాళ్లకు లీజులకు ఇచ్చుకున్నారు అంటూ గతంలో విమర్శించిన విజయసాయిరెడ్డి.. తాజాగా 350 ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై చంద్రబాబుకు కడుపుమంట మొదలైంది అన్నారు. అక్టోబర్ 14న టెక్నికల్, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్స్ వేయాల్సి ఉందని, సరిగ్గా అలాంటప్పుడే చంద్రబాబుకు 7500 కోట్ల క్విడ్ ప్రో జరిగినట్టు కల వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు.