ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది: చంద్రబాబు

By సుభాష్  Published on  26 Oct 2020 6:13 AM GMT
ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది: చంద్రబాబు

చిత్తూరు టీడీపీ నాయకుల అరెస్టులను ఆ పార్టీ నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. కుప్పం నియోజకవర్గంపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని, తక్షణమే టీడీపీ నేతల గృహ నిర్బంధం ఎత్తివేయాలని, అలాగే అక్రమ కేసులను తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కుప్పం రైతుల సాగుఈనటి సమస్యలు, తాగునీటి ఎద్దడి పరిష్కరించాలన్నారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కోరారు.

ప్రాజెక్టు పనులు పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరు తీసుకురావాలని కోరుతూ రామకుప్పం మండలంలో టీడీపీ నేతల మహాపాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేశారు. రామకుప్పం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులోని ఆయన స్వగృహం వద్ద వేకువజాము నుంచే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పలువురి నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీ ఎత్తున మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story