విషమంగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం

By సుభాష్  Published on  26 Oct 2020 5:58 AM GMT
విషమంగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం

బెంగలీ సినీ చరిత్రలో లెజండరీ నటుడిగా కీర్తి గడించిన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. ఆయన స్కృహలో లేరని, రక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రక్తంలో హిమాగ్లోబిన్‌ శాతం పూర్తిగా తగ్గిపోయిందని, యూరియా, సోడియం స్థాయి పెరిగిందని తెలిపారు.

అయితే సౌమిత్ర ఊపిరితిత్తులు, గుండె బాగా పని చేస్తున్నాయని, కానీ బ్రెయిన్‌ ఫంక్షనింగ్ సరిగా లేదని వైద్యులు పేర్కొన్నారు. తదుపరి చికిత్స గురించి న్యూరాలజిస్ట్‌, నెఫ్రాలజిస్ట్‌ బోర్డు ఈ రోజు సమావేశమై చర్చి్తాయని తెలిపారు. సౌమిత్ర ఛటర్జీ కుటుంబీకులు ఆమోదం అంగీకరిస్తే వెంటనే చికిత్స నిర్వహిస్తామన్నారు. గత ఏడాది ఆయనకు న్యూమోనియా రాగా, చాలా కాలం పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. గత పదిహేను రోజుల కిందట కరోనా సోకడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 85 ఏళ్లు. బెంగాలి తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన ఈయన పలు బెంగాలీ సినిమాలతో అక్కడి వారికి ఆరాధ్య నటుడుగా అయ్యాడు.

ఈయనకు ఉత్తమ నటుడిగా ఒక జాతీయ పురస్కారంతోపాటు మరో ప్రత్యేక జ్యూరీ విభాగంలో మరో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఈయన చేసిన సేవలకు గానూ కేంద్రం 2012లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. సౌమిత్ర ఛటర్జీకి కరోనా సోకడం, ఆరోగ్య మరింత విషమించడంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయన కోలుకుని తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు.

Next Story