14 రోజుల పాటు కనిపించకుండా పోయిన వ్యక్తి ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై..

By సుభాష్  Published on  26 Oct 2020 5:43 AM GMT
14 రోజుల పాటు కనిపించకుండా పోయిన వ్యక్తి ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై..

14 రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరికి ఆస్పత్రి టాయిలెట్‌లో శవమై కనిపించడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యభన్‌ యాదవ్‌ (27) అనే వ్యక్తి టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి తోడు కరోనా కూడా సోకడంతో కొద్ది రోజుల కిందట ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అక్టోబర్‌ 3న టాయిలెట్‌లోకి వెళ్లి ఊరిరి తీసుకోలేని పరిస్థితిలో అక్కడే ప్రాణాలు వదిలాడు.

ఇక అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోవడంతో అక్టోబర్‌ 4న పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసుగా నమోదైంది. ఈనెల 18న ఆస్పత్రి వార్డ్‌ బాయ్‌ అక్కడి టాయిలెట్‌లో నుంచి దుర్వాసన రావడంతో గుర్తించి తలుపులు తెరిచి చూడగా, సూర్యభన్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఆస్పత్రి నుంచి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it