కాసేపట్లో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 10:12 AM GMT
కాసేపట్లో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు హాట్‌ హాట్‌ మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కానీ..అధికారంలోకి వచ్చిన వైసీపీ పై మాత్రం గత ఆరు నెలలుగా విమర్శల జల్లు కురుపిస్తూనే ఉంది. అంతే కాకుండా.. టీడీపీలోని కీలక నేతలు వైసీపీలో చేరడంతో పార్టీ రోజురోజుకు క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ స్థితిగతుల పై పర్యవేక్షించారు.

కాగా.. మరికాసేపట్లో పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు నివాసంలోనే సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలకు, ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అయితే ఇసుక కొరత సమస్యపై నిన్న దీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో తాజా భేటీ నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది.

Next Story
Share it