ఉపాధ్యాయుడిగా మారిన చంద్రబాబు!

By Newsmeter.Network
Published on : 22 March 2020 2:48 PM IST

ఉపాధ్యాయుడిగా మారిన చంద్రబాబు!

ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడిగా మారాడు. ప్రధాని నరేంద్ర మోదీపిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగుతుంది. దీనిలో భాగంగా ఏపీలోనూ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చంద్రబాబుసైత తన ఇంటికే పరిమితమై కుటుంబంతో సమయం గడుపుతున్నారు. ఈ సందర్భంగా మనవడికి పాఠాశాలు చెబుతూ కనిపించారు. దేవాన్ష్‌కు ఆంగ్లలో ఉన్న పాఠానికి అర్థాన్ని చెబుతూ పాఠ్య సారాంశాన్ని బోధించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.



ఈ సందర్భంగా ట్విట్టర్‌లో మన జాగ్రత్త కోసం ఈ రోజు ఇంట్లోనే ఉండాలని, కుటుంబంతో సమయాన్ని గడపాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు ఈ వీడియోలో తాతా, మనవడిని చూసి తెగ సంబరపడిపోతున్నారు.

Next Story