డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

By రాణి  Published on  11 March 2020 6:03 AM GMT
డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు గురించి పేర్కొంటూ..ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసి పంపారు. నామినేషన్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేయాలని, కొందరు పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

Also Read : 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండగా..వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే అక్కడే ఉన్న పోలీసులు ఆపాల్సిందిపోయి చోద్యం చూస్తున్నారంటూ విమర్శించారు. కొందరు పోలీసుల తీరుతో ఓటర్లు నమ్మకం కోల్పోతున్నారని, నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లు పెట్టాలని చంద్రబాబు డీజీపీ గౌతమ్ కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కదా అని తమ ఫిర్యాదులను పక్కన పెట్టడం సబబు కాదని, తమ ఫిర్యాదులను స్వీకరించి..వాటిపై స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Also Read : ఆ న‌లుగురూ ఎవ‌రు.? ఆశావ‌హుల‌లో మొద‌లైన‌ టెన్ష‌న్..!

కాగా..నేటి నుంచి 13వ తేదీ వరకూ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, 23న పోలింగ్ ఉంటుంది. ఏ కారణంచేతనైనా 23న పోలింగ్ జరుగకపోతే 26న రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సమయంలోనే వెల్లడించారు. 27న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

Next Story
Share it