రాష్ర్టంలో సైకో పాలన సాగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దారుణంగా అవమానిస్తున్నారని, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చాలా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీఎల్పీ నుంచి పేపర్లు తెచ్చినా అడ్డుకుంటున్నారంటే జగన్ ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన బుద్ధి చెప్తారన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ గేటు వద్దనే అడ్డుకుంది. ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లరాదని, ప్లకార్డులను బయట వదిలి లోపలికి రావాలని చెప్పారు. తాము అసెంబ్లీకి వెళ్లమని, నేరుగా టీడీపీ ఆఫీసుకు వెళ్తామని ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ సెక్యూరిటీ పట్టించుకోలేదు. లోపలికి రాకుండా అడ్డుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. అక్కడే ఉన్న మీడియా ఈ ఘటనపై చంద్రబాబును అడగడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ అధికారం ఉందన్న అహంకారంతో ప్రవర్తిస్తోందన్నారు.

 

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.