చంద్రబాబు నాయుడు బర్త్ డే స్పెషల్ సాంగ్
By రాణి Published on 20 April 2020 3:35 PM IST- దండాలయ్యా..దండాలయ్యా..మా గుండె నువ్వేనయ్యా
- రైల్వే కోడూరు టీడీపీ ఇన్ ఛార్జ్ నరసింహ ప్రసాద్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి 70వ పుట్టిన రోజు సందర్భంగా రైల్వే కోడూరు టీడీపీ ఇన్ ఛార్జ్ నరసింహ ప్రసాద్ ఓ పాటను రూపొందించారు. '' సార్ ఇది పాట కాదు, మాలో అణువణువు నిండి ఉన్న భావం. నెలలో ఒక్కసారి వచ్చే అమావాస్య లాంటి ఈ పాలనను చూసి అధైర్య పడటం లేదు. మళ్లీ రానున్న పున్నమి చంద్రుడి కోసం చూస్తున్నాం. రానున్న మీ పాలన కోసం ఎదురు చూస్తున్నాం.'' అనే ఇంట్రోతో మొదలయ్యే ఈ పాట ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : లాఠీ దెబ్బలకు యువకుడు మృతి..ఎస్సై సస్పెండ్
కాగా..టీడీపీ నేతలు అఖిల ప్రియ, పంచుమర్తి అనురాధ, జయదేవ్ గల్లా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సిద్ధా రాఘవరావు, సీఎం రమేష్, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కేశినేని నాని, గంటా శ్రీనివాసరావు, రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సినీ నటుడు దగ్గుబాటి రానా చంద్రబాబు నాయుడికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినప్రతి ఒక్కరికీ చంద్రబాబు నాయుడు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Also Read :చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు