నిహా వరుడు.. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో చూశారా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 1:55 PM IST
నిహా వరుడు.. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో చూశారా..!

మెగా ఫ్యామిలీ ఆడపడుచు..అదేనండి నాగబాబు కూతురు నిహారిక త్వరలోనే ఓ ఇంటిదవ్వనుందన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. శుక్రవారం తన బ్యాచిలర్ లైఫ్ కు చెక్ పెడుతూ..ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు ఓ ఫొటోను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది నిహా. అప్పటి నుంచి ఆమెకు ప్రశ్నలు వెల్లువలా వచ్చాయి. పెళ్లా ? ఎప్పుడు ? వరుడు ఎవరు ? లవ్ మ్యారేజా ? లేక అరేంజ్డ్ఆ ? అంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న కామెంట్ల వర్షాన్ని తట్టుకోలేక నిహారిక తనకు కాబోయే భర్తను హగ్ చేసుకుని, ముద్దు పెడుతూ దిగిన ఫొటోలను పెట్టి..వరుడి వివరాలు కూడా చెప్పింది.

View this post on Instagram

NisChay 💜

A post shared by Chaitanya Jv (@chaitanya_jv) on

నిహా కు కాబోయే భర్త పేరు చైతన్య. బిట్స్ పిలాని లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్నాడు. అన్నింటినీ మించి చైతన్య గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ కొడుకు. నిహారిక లాగానే చైతన్య కూడా తన ఇన్ స్టా ఖాతాలో వారిద్దరి ఫొటోను పెట్టి #NisChay అనే హ్యాష్ టాగ్ ను కూడా పెట్టాడు. దీంతో వీరిద్దరి పెళ్లి నిశ్చయమైందని క్లారిటీ వచ్చేసింది నెటిజన్లకు. ఇంకొక్క సందేహం మాత్రం మిగిలిపోయింది. లవ్ మ్యారేజ్ ? లేక అరేంజ్డ్ ? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లేనని తెలుస్తోంది. నాగబాబు కు ఐజీ ప్రభాకర్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, ఆ రకంగానే నిహారిక - చైతన్యలకు వివాహం చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు సమాచారం. తండ్రి చెప్పగానే వరుడిని కలిసిన నిహా కు చైతన్య బాగా నచ్చేశాడట. ఇక పెళ్లంటూ చేసుకుంటూ అతడినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందేమో..హగ్ లు, కిస్ లు.....

ఆగస్టులో నిశ్చితార్థం..వచ్చే వేసవిలో పెళ్లి అనుకుంటున్నారట. ఒక్కసారి నిహా వరుడి పై ఓ లుక్కేయండి. ఆ ఒడ్డు, పొడుగు చూస్తుంటే హీరోలా ఉన్నాడు కదా. నెటిజన్లంతా ఇదే అనుకుంటున్నారు. నిహా తో పెళ్లి తర్వాత చైతన్య కూడా టాలీవుడ్ లోకి అడుగు పెడతాడన్న ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనుకోవడంలో తప్పలేదు కదా. ఎందుకంటే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం తర్వాత ఆమె భర్త టాలీవుడ్ లో విజేత సినిమాతో అరంగేట్రం చేశాడు. నిహారిక కు కాబోయే భర్త విషయంలో కూడా ఇలాగే జరగొచ్చేమో.

Next Story