మహిళలు మీ బంగారం జాగ్రత్త..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 5:46 AM GMT
మహిళలు మీ బంగారం జాగ్రత్త..!

మహబూబాబాద్‌: మహిళలకు సమాజంలో భద్రత కల్పించటానికి అన్నిరంగాలు కృషి చేస్తున్నప్పటికి..అక్కడడక్కడ ఏదో రూపంలో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ మహిళ మెడలో చైన్‌ గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. స్థానిక మార్వాడి బజార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్‌కు వెళ్లిన మహిళ మెడలోంచి 2 తులాల గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లడంతో..స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it