మరో హ్యాట్రిక్‌తో 'చాహర్' విధ్వంసం

By Medi Samrat
Published on : 12 Nov 2019 6:35 PM IST

మరో హ్యాట్రిక్‌తో చాహర్ విధ్వంసం

నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివ‌రి టీ-20లో హ్యాట్రిక్‌తో చెల‌రేగిన దీప‌క్ చాహ‌ర్.. మూడు రోజుల వ్యవధిలోనే మరో హ్యాట్రిక్‌తో ప్రత్యర్థులకు షాక్ ఇచ్చాడు. వివ‌రాళ్లోకెళితే.. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీలో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న చాహ‌ర్.. తిరువనంతపురం వేదికగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.

ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో బౌలింగ్ దిగిన చాహ‌ర్ దర్శన్ నల్కడే, శ్రీకాంత్ వాగ్, అక్షయ్ వాడ్కర్ వికెట్లను వరుస బంతుల్లో పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో 13 ఓవర్ల మ్యాచ్‌లో విదర్భ 9 వికెట్లు కోల్పోయి.. 99 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చాహర్ 18 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

Next Story