దీపక్‌ చహర్‌.. టీమిండియా బౌల‌ర్. చహర్‌ బంగ్లాతో జరిగిన మూడు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌లో 8 వికెట్లు సాధించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. చివరి టీ20లో 6 వికెట్లు సాధించిన‌ చహర్‌.. సోమవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒకేసారి 88 స్థానాలను దాటి 42వ స్థానంలో నిలిచాడు. చివ‌రి టీ20లో హ్యాట్రిక్‌ సాధించి పొట్టి ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత బౌలర్‌గా వరల్డ్‌ రికార్డు సృష్టించాడు.

ఇక టీ20ల్లో అఫ్గానిస్తాన్ బౌల‌ర్ రషీద్‌ ఖాన్‌ టాప్‌ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 2వ‌ స్థానంలో న్యూజిలాండ్‌ మిచెల్‌ సాంట్న‌ర్‌ కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్ విభాగంలో పాక్ ఆటగాడు బాబర్‌ అజామ్‌ టాప్‌ ర్యాంకులోనే ఉండగా.. హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ ఏడో స్థానంలో.. కేఎల్‌ రాహుల్‌ ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతున్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

One comment on "నిన్న‌టి వ‌ర‌కూ 130.. నేడేమో 42.. ఒకేసారి ఎగ‌బాకాడు.!"

Comments are closed.