అనుష్కకు చాహల్ విన్నపం..
By తోట వంశీ కుమార్ Published on 18 April 2020 8:34 AM GMTతనను ఓపెనర్‌గా పంపాలని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెప్పాలని.. కోహ్లీ భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మను కోరాడు టీమ్ఇండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్. అనుష్క చెబితే కోహ్లీ తప్పకుండా వింటాడని అన్నాడు.
లాక్‌డౌన్ కారణంగా భారత క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. లాక్‌డౌన్ కాలంలో తాము ఏం చేస్తున్నామో.. వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీకి హెయిర్ కట్ చేసిన అనుష్క శర్మ.. తాజాగా విరాట్ ను ఆటపట్టించింది.
విరాట్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడూ .. అభిమానులు.. వీ వాంట్ ఫోర్ అంటూ అరుస్తుంటారు. అనుష్క కూడా మైదానంలో ఓ అభిమాని ఎలా అంటాడో.. అలాగే అంటూ కోహ్లీని ఆట పట్టించే ప్రయత్నం చేసింది. ‘ ఏయ్ కోలీ చౌకా మార్.. చౌకా.. క్యా కర్రా’ ( ఓయ్ కోహ్లీ.. ఫోర్ కొట్టూ.. ఫోర్ ) అంటూ అరుస్తూ ఆటపట్టించింది. దీనికి విరాట్.. అనుష్క వైపు ఓ సారి చూసి ఊరుకున్నాడు. ఈ వీడియోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోను భారత స్పిన్నర్ చాహల్ చూశాడు. దీనిపై ఫన్నీగా కామెంట్ చేశాడు. "వదినా.. విరాట్‌కు చెప్పు.. నన్నుఓపెనర్‌గా పంపమనూ.. నువ్వు చెబితే.. వింటాడు" అంటూ కామెంట్ చేశాడు. నిజానికి చాహల్‌కి ఓపెనర్‌గా ఆడాలని ఉందని గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. టైం వచ్చింది కాబట్టి.. చాహల్ తన మనసులోని మాటను ఇలా బయట పెట్టినట్లు ఉన్నాడు.