దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ ఏప్రిల్‌ 14తో ముగుస్తుందనుకునేలోపే  మర్కాజ్‌ ఉదాంతం తర్వాత కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుద చేసింది. గడిచిన 24 గంటల్లో ఇప్పటి వరకూ దేశంలో 6412 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 199 మంది మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 678 కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, 33 మరణాలు సంభవించినట్లు తెలిపింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.