దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల

By సుభాష్  Published on  10 April 2020 10:59 AM GMT
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ ఏప్రిల్‌ 14తో ముగుస్తుందనుకునేలోపే మర్కాజ్‌ ఉదాంతం తర్వాత కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుద చేసింది. గడిచిన 24 గంటల్లో ఇప్పటి వరకూ దేశంలో 6412 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 199 మంది మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 678 కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, 33 మరణాలు సంభవించినట్లు తెలిపింది.

Next Story