'కరోనా మృతుల' కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా.. ఎంతంటే.?

By అంజి  Published on  14 March 2020 11:43 AM GMT
కరోనా మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా.. ఎంతంటే.?

ఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న మహ్మమారి కరోనా వైరస్‌ను.. విపత్తుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా.. వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్నారు. అలాగే ఆస్పత్రుల్లో అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో కరోనా కేసులు 84కు చేరుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరో కరోనా కేసు నమోదు అయ్యింది. ఇందిరానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఇంతకుముందు కరోనా వైరస్‌ సోకిన డాక్టర్‌ నుంచి ఇతనికి వైరస్‌ సోకిందని డాక్టర్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా బాదితుల సంఖ్య 10కి చేరింది.

ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, స్కూళ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతు హైలెవెల్‌ కమిటీ సమావేశం జరిగింది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

Next Story