ఆరోగ్య సేతు తప్పనిసరి..అది ఉంటేనే ఆఫీసులకు రండి : కేంద్రం

By రాణి  Published on  30 April 2020 6:20 AM GMT
ఆరోగ్య సేతు తప్పనిసరి..అది ఉంటేనే ఆఫీసులకు రండి : కేంద్రం

ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగించి తీరాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ ప్రాణాంతకమైన వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను ఖచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాలని బుధవారం ఆదేశించింది. ఈ యాప్ ద్వారా సదరు ఉద్యోగి ఎవరిని కలిసినా వారికి కరోనా వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని ముందే హెచ్చరించి అలర్ట్ చేస్తుంది. అందుకే ఆఫీస్ కు వెళ్లే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఇంటి నుంచి బయల్దేరే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని, శరీర లక్షణాలను యాప్ లో స్టోర్ చేయాలి. అలా పెట్టిన తర్వాత మీరు సేఫ్ లేదా లో రిస్త్ అనే మెసేజ్ వస్తేనే ఆఫీసుకు వెళ్లాలి. ఈ రెండు కాకుండా మోడరేట్ లేదా హై రిస్క్ అనే వస్తే బయటికి వెళ్లకూడదు.

మళ్లీ ఆ యాప్ లో మీరు సేఫ్ అని చూపించేంత వరకూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది కేంద్రం. కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలను ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా పాటించాలని కేంద్రం జాయింట్ సెక్రటరీలను ఆదేశించింది.

Also Read : తెలంగాణలో కరోనా ఫ్రీ జిల్లాలివే

Next Story