పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు కాగా, రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై కేంద్రం ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఖర్చు చేసింది. మిగతా రూ.32 వేల కోట్లను కూడా భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో పోలవరం భూసేకరణ, పునరావాసంపై స్పష్టత వచ్చినట్టయింది.

భూసేకరణ, పునరావాస వ్యయ భరింపునకు ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఉన్న రూ.2200కోట్లును ఆడిటింగ్‌ పూర్తవ్వగానే.. నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ పనుల కోసం రూ.5వేల కోట్లు వ్యయం కానుంది. మిగిలిన 7వేల కోట్లు భారం రాష్ట్రం పడనుంది.

 

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.