విశాఖ గ్యాస్ లీక్ పై సినీ ప్ర‌ముఖుల స్పంద‌న‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2020 10:22 AM GMT
విశాఖ గ్యాస్ లీక్ పై సినీ ప్ర‌ముఖుల స్పంద‌న‌

విశాఖలోని ఎల్‌జీ పాలిమ‌ర్స్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ప‌రిస‌ర గ్రామ ప్ర‌జ‌లు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10మందికి పైగా మృతి చెందారు. కాగా.. ఈ ఘ‌టన‌పై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు.

'విశాఖలో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. లాక్‌డౌన్ త‌రువాత తిరిగి ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్రారంభిచేట‌ప్పుడు అధికారులు త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరుకుంటున్నాను' - చిరంజీవి

'వైజాగ్ గ్యాస్ లీక్ వార్త విని చాలా బాధకు గురయ్యా. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' - మ‌హేష్ బాబు

'ఈ రోజు ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వైజాగ్ ప్ర‌మాద దృశ్యాలు చూసి క‌ల‌త చెందా. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గవంతుడిని కోరుకుంటున్నా' - ప్ర‌గ్యా జైస్వాల్

'ఈ విషాద‌క‌ర వార్త‌తోనే నిద్ర‌లేచాను. ఎవ‌రైతే త‌మ‌కు ఇష్ట‌మైన వారిని కోల్పోయారో వారంద‌రికి నా సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. అలాగే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారు వెంట‌నే కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాను' - త‌మ‌న్నా

'వైజాగ్ గ్యాస్ లీక్ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' - మంచు ల‌క్ష్మీ

'వైజాగ్ దుర్ఘటన దృశ్యాలు చూసి షాక్‌కు గురయ్యా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' - అనిల్ రావుపూడి

'వైజాగ్‌.. ఉద‌యం జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల్ల ఇప్ప‌టికి ఆ గ్యాస్ అక్క‌డి గాలిలో ఉంటుంది. కాబ‌ట్టి ఆ ప్రాంతానికి ద‌గ్గ‌ర్లో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ వెట్ మాస్క్‌తో ముఖాన్ని క‌ప్పుకోగ‌ల‌రు' - నిఖిల్

Next Story