మాస్కుల గురించి మహేష్ పోస్టు.. ఎంతో మంది ప్రముఖులు కూడా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 May 2020 12:29 PM ISTలాక్ డౌన్ ను చాలా వరకూ ఎత్తివేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు మునుపటి లాగా బయట తిరగాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా.. మనుషుల్లో మార్పులు రావాల్సిందే.. మాస్కులు ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గతంలో చాలా సార్లు కరోనా మీద అవగాహన కల్పించడం కోసం పోస్టులు పెడుతూ వచ్చారు. మాస్కులు వేసుకోండి.. ముఖానికి ఏదైనా అడ్డం పెట్టుకుంటే చాలా మంచిది అని చెబుతూనే ఉన్నారు.
తాజాగా కూడా మహేష్ బాబు తన సోషల్ మీడియాలో వియర్ ద మాస్క్ #WearTheMask అనే ప్రచారానికి తన వంతు తోడ్పాటు అందించారు. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, షారుఖ్ ఖాన్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాలు ఈ ఫోటో లో కనిపించారు. టాలీవుడ్ నుండి మహేష్ బాబు, క్రికెటర్స్ లో ధోని ఈ ఫోటోలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ముఖానికి ఏదో ఒకదాన్ని అడ్డం పెట్టుకుని కనిపించారు. ధోని తన గ్లోవ్స్ ను అడ్డం పెట్టుకోగా.. హృతిక్ క్లాప్ బోర్డు వెనకాల ఉన్నారు. అందరూ మూతికి ఏదో ఒకటి అడ్డుపెట్టుకుని మాస్క్ ల ఉపయోగాన్ని తెలియజేసారు. ప్రముఖ ఫ్యాషన్ అండ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటోలను తీశారు. #MASKINDIA మూమెంట్ ను ఈ స్టార్స్ అందరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు.