నటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతిపై ప్రముఖుల సంతాపం
By సుభాష్ Published on 8 Sept 2020 2:11 PM ISTప్రముఖ విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణి సినీ ఇండస్ట్రీకి తీరని లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక వారు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్, సుమన్ మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్, రవితేజ, ప్రకాశ్ రాజ్, అనిల్ రావిపూడి, సుదీర్‌బాబు, గోపిచంద్, తమన్, బాలకృష్ణ , డైరెక్టర్లు, నిర్మాణతలు, మ్యూజిక్ డైరెక్టర్లు తదితరులు సంతాపం తెలిపారు. వెండి తెరమీద వెలుగుతూ కూడా రంగస్థలాన్ని మరువలేని నటుడు, రాయలసీమ యాసకు ప్రాణం పోసిన మా జయప్రకాశ్రెడ్డి గుండెపోటుతో హఠాత్మరణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.
చిత్ర పరిశ్రమలో మంచి మిత్రుడి లాంటి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాటక రంగాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ, పాత్రలు పోషిస్తుండేవారన్నారు. ఇండస్ట్రీలో ఎంతో ప్రేమగా పిలుచుకునే పేరు జేపీ అని, ఆయన మరణం తీరని లోటన్నారు. రాయలసీమ ట్రెండ్‌తో భయంకరమైన విలన్ నుంచి కమెడియన్‌గా రాణించారన్నారు. చివరిగా సారిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'కూజాలు చెంబులైపోతాయి' అంటూ తనకంటూ మార్క్ ఏర్పర్చుకున్నారని అన్నారు. ఉదయం పూట ఇలాంటి చెడు వార్త వింటామని ఎవ్వరు ఊహించలేదని, చాలా ఆరోగ్యకరమైన వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. జయప్రకాశ్‌రెడ్డితో ప్రయాణం ప్రతి ఒక్కరు చేశారని, ఓ నటుడిగా, మంచి వ్యక్తిగా, ఆయన స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరన్నారు. వీటితో పాటు రాజకీయ నేతలు, నటీనటులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.
ఇవీ చదవండి: