నాలుగో రోజు వివేకా హత్య కేసుపై విచారణ.. కీలక విషయాలు తెలుసుకున్న సీబీఐ

By సుభాష్  Published on  21 July 2020 11:31 AM GMT
నాలుగో రోజు వివేకా హత్య కేసుపై విచారణ.. కీలక విషయాలు తెలుసుకున్న సీబీఐ

ఏపీలో సంచలన సృష్టించిన మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై గత నాలుగు రోజులుగా సీబీఐ విచారణ జరుపుతోంది. పులివెందులలోని వైఎస్‌ వివేకా నివాసంలో కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించారు. సిట్‌ నుంచి కూడా కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. వివేకా నివాసంలో బెడ్‌ రూమ్‌, బాత్ రూమ్‌లను పరిశీలించారు. భార్య సౌభాగ్యమ్మతో పాటు కూతురు సునీతను పలు విషయాలు అడిగి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా, 2019 మార్చి 15న వైఎస్‌ వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లోనే ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు, ఇతర గాయాలు కనిపించాయి. ఈ కేసులో ఇప్పటికే 1300 అనుమానితులను ప్రశ్నించింది. ముందుగా ఈ హత్య కేసును సిట్‌కు అప్పగించగా, విచారణ ముందుకు సాగడం లేదని వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ కేసు ను వేగవంతంగా దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో కొందరు టీడీపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్‌ విచారణ జరిపితే తమను అన్యాయంగా ఇరికించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును సీబీఐకి అప్పగించింది.

Next Story