క్యాట్ పరీక్షలో సిటీ టాపర్స్‌ వీళ్లే

By సుభాష్  Published on  5 Jan 2020 12:09 PM GMT
క్యాట్ పరీక్షలో సిటీ టాపర్స్‌ వీళ్లే

వారానికి ఆరు రోజులు ఉద్యోగం చేస్తూ, తీరిక లేకుండా గడిపే ఒక ఉద్యోగి క్యాట్ పరీక్షలో ఘనమైన విజయాన్ని సాధించాడు. హైదరాబాద్ లోని యప్రాల్ కు చెందిన సమీర్ అహ్మద్ బెంగుళూరులో ఎల్ అంట్ టీ కంపెనీలో ఉద్యోగిగా ఉంటున్నాడు. చాలా సందర్భాల్లో అతని షిఫ్టు డ్యూటీ ఏకబిగిన పన్నెండు గంటల వరకూ కూడా ఉంటుంది. అయినా వీటన్నిటినీ అధిగమించి అతను క్యాట్ పరీక్షలో 99.88 పర్సెంటేజ్‌ సాధించాడు.

Sameer Ahmed

ఆయన ప్రతి ఆదివారం పూర్తిగా చదువుకే కేటాయించేవాడు. వారాంతాల్లో మాక్ టెస్టుల్లో పాల్గొనేవాడు. ప్రతిరోజూ తెల్లవారు జామున, రాత్రి పూట చదువును అభ్యసించేవాడు. క్యాట్ పరీక్షా ఫలితాలను శనివారం మధ్యాహ్నం ఐఐఎం, కోజిక్కోడ్ వెలువరించింది.

మొత్తం మీద పది మంది వంద పర్సెంటైల్ ను సాధించారు. వారంతా పురుషులే కావడం విశేషం. వారందరూ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ నేపథ్యానికి చెందినవారే. ఈ పదిమంది తరువాత 21 మంది 99.99 పర్సెంటేజ్‌ ను సాధించారు. వీరిలో 19 మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యార్థులే. మొత్తం 2,09,926 మంది పరీక్ష వ్రాశారు. వీరికి 376 కేంద్రాల్లో నవంబర్ 24 న పరీక్షను నిర్వహించడం జరిగింది. క్యాట్ పర్సెంటేజ్‌ ల ఆధారంగా, ఇతర అంశాల ఆధారంగా దేశంలోని ఐఐఎంలలో ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు దేశంలోని 115 ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా క్యాట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది.

క్యాట్ పరీక్షల్లో వంద శాతం మార్కుల సాధించిన తెలుగోడు

తాజాగా వెలువడిన సీ ఏ టీ 2019 పరీక్షలో ఓ తెలుగు కుర్రాడు మరో సారి నూటికి నూరు శాతం మార్కులు సంపాదించాడు. ఆ విద్యార్థి రంగారెడ్డి జిల్లాకు చెందిన వాడుగా భావిస్తున్నారు. అయితే అతను ముంబాయి ఐఐటీలో చదువుతున్నాడు. అతనొక్కడే కాదు. మరో పది మంది విద్యార్థులు కూడా నూటికి నూరు శాతం పర్సెంటేజ్‌ పాయింట్స్ సాధించారు.

గత మూడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సీ ఏ టీ పరీక్షలో విజయం సాధించినా నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న వారు లేరు. ఈ సారి మూడేళ్లలో తొలిసారి తెలుగు విద్యార్థి ఈ రికార్డును సాధించాడు. ఇక 99.99 శాతం సాధించిన వారిలో హైదరాబాద్ కి చెందిన సాత్విక్ కొల్లూరు ఉన్నాడు. అయన ప్రస్తుతం ముంబాయి ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతని లక్ష్యం ఎం బీ ఏ ను అహ్మదాబాద్ లేదా బెంగుళూరు లో అభ్యసించడం. అదే కనుక సాధ్యం కాకపోతే మళ్లీ వచ్చే ఏడాది పరీక్ష వ్రాస్తానని అంటున్నాడు. క్యాట్ 2019 లో మొత్తం 21 మంది దేశవ్యాప్తంగా 99.99 శాతాన్ని సాధించారు. వీరిలో 19 మంది ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ నేపథ్యానికి చెందిన వారు.

అయితే తెలుగు విద్యార్థుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకునే వారి సంఖ్య తక్కువగా ఉండటానికి ఇంకొక కారణం ఉందంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది ఉత్తమ విద్యార్థులు క్యాట్ పరీక్ష వ్రాయడం పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదు. తెలుగువారు క్యాట్ టాపర్లు కాకపోవడానికి ఇదే ప్రధాన కారణం అని వారంటున్నారు.

Next Story