మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టర్‌ (ఈడీ) కేసు నమోదైంది. నిధులను మళ్లీంచే విషయంలో ఫేమా చట్టం కింద సాంబశివరావుతోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై కేసు నమోదు. మలేషియా, సింగపూర్‌కు రూ.16 కోట్లను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. కాగా, రాయపాటి కుమారుడు, ట్రాన్స్‌ టాయ్‌పై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. 15 బ్యాంకుల నుంచి 8వేల 832 మేరకు రుణాలు తీసుకున్న కంపెనీ, మొత్తం రూ. 3822 కోట్ల నిధులు మళ్లించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్‌ మలేషివయా రష్యాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు అభియోగాలున్నాయి. ఇక రెండు రోజుల కిందట జరిగిన సీబీఐ సోదాలపై రాయపాటి స్పందించారు. సీబీఐ సోదాలు జరిగిన సమయంలో తాను కంపెనీలో లేనని, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ వ్యవహారాలను సీఈవో చూసుకుంటున్నారని, సీబీఐ సోదాలలో తనకేం సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

సుభాష్

.

Next Story