అసదుద్దీన్‌ ఓవైసీపై కేసు నమోదు

By సుభాష్
Published on : 13 March 2020 5:24 PM IST

అసదుద్దీన్‌ ఓవైసీపై కేసు నమోదు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని ఓ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్‌ మిశ్రా హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన నాంపల్లి కోర్టు ఓవైసీపై కేసు నమోదు చేయాలని ఆదేశాల మేరకు మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆయనతోపాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైంది. ఇటీవల ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కర్ణాటకలో జరిగిన ఓ సభలో ఓవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా కేసు నమోందైంది. ఈ మేరకు ఓవైసీపై ఐపీసీ సెక్షన్‌ 153, 153ఏ, 117, 295ఏ, 120బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.

Next Story