ఉత్తరప్రదేశ్‌లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు- బస్సు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన వారికి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story