కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
By Newsmeter.Network Published on 27 Feb 2020 11:17 AM IST
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం పీఏపల్లి మండలం దుంగ్యాల వద్ద కారు అదుపుతప్పి ఏఎంఆర్సీ కాలువలోకి దూకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. భార్యాభర్తలులతో పాటు కుమారై మృతి చెందగా.. వారి కుమారుడు కార్తీక్‌ను స్థానికులు రక్షించారు.
మృతులను పీఏపల్లి మండలం వడ్డెరగూడేనికి చెందిన రంగయ్య(45), అలివేలు(38), కీర్తిలు(18)గా గుర్తించారు. కారు టైరుపేలడంతో.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story