హైదరాబాద్ క్రైమ్ రౌండప్ @ 2019 : సీపీ అంజనీ కుమార్

By రాణి  Published on  26 Dec 2019 8:50 AM GMT
హైదరాబాద్ క్రైమ్ రౌండప్ @ 2019 : సీపీ అంజనీ కుమార్

ముఖ్యాంశాలు

  • సీసీ కెమెరాల నిఘాలో నగరం
  • గతేడాది కన్నా తగ్గిన క్రైమ్ రేటు
  • పెరిగిన వరకట్న వేధింపుల కేసులు

హైదరాబాద్ మొత్తం మీద ఈ ఏడాది 14 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 సంవత్సరంలో జరిగిన క్రైమ్ లు, క్రైమ్ కేసుల్లో పడిన శిక్షలు తదితర వివరాలను సీపీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం మీద 3 శాతం క్రైమ్ రేటు తగ్గిందన్నారు. ఐపీసీ సెక్షన్ కింద 15,598 కేసులు నమోదవ్వగా 42 శాతం క్రైమ్ కేసుల్లో దోషులకు శిక్షలు పడినట్లు సీపీ వివరించారు. Bodily క్రైమ్ 9శాతం, ప్రాపర్టీ క్రైమ్ 2%, చైన్ స్నాచింగ్ 30%తగ్గిందన్నారు. అలాగే రూ.26 కోట్లకు పైగా దొంగిలించిన నగదును, ప్రాపర్టీని సీజ్ చేసి ప్రపంచ రికార్డును నమోదు చేశామన్నారు. ఆటో మొబైల్ కేసులు 17 శాతం, వరకట్న కేసులు 11శాతం పెరిగాయని సీపీ పేర్కొన్నారు.

చైల్డ్ లేబర్ గా ఉన్న 400 మందికి పైగా చిన్న పిల్లలను రక్షించి, వారిని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించి, చదివిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది నగరంలోని స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో జరిగిన వివిధ సంస్కృత కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా శాంతియుతంగా జరిగేలా నిర్వహించామన్నారు. షీ టీమ్ అండ్ భరోసా సెంటర్ ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ షీ టీమ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రేప్ కేసులు తగ్గాయన్నారు. 2018లో 178 కేసులు ఉంటే 2019లో 150 కేసులు నమోదు అయ్యాయి. అంటే 16 శాతం రేప్ కేసులు తగ్గాయి. 2019లో 17 రేప్ కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు శిక్ష పడినట్లు సీపీ అంజనీ తెలిపారు. 2019 లో 27,737 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవ్వగా..కోర్టు ద్వారా రూ.8 కోట్ల 32 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశామన్నారు. ఈ ఏడాదిలో హైదరాబాద్ సిటీ యాక్సిడెంట్ కేసులు 2,377 నమోదు కాగా..261 మంది ఈ యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాగే సిటీ పోలీస్ లిమిట్స్ లో పీడీ యాక్ట్ కింద 135 కేసులు నమోదు చేశామన్నారు. రాత్రిపూట హైదరాబాద్ హైవేలపై, సిటీలో 122 వెహికల్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా..3 లక్షల 40 వేల సీసీ కెమెరాల నిఘాలో హైదరాబాద్ సిటీ ఉందన్నారు.

Next Story