'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' ద‌ర్శ‌కుడు తదుప‌రి చిత్రం ఎవ‌రితో..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 5:13 AM GMT
కేరాఫ్ కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు తదుప‌రి చిత్రం ఎవ‌రితో..?

'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్న యువ ద‌ర్శ‌కుడు మ‌హా. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ రిలీజ్ చేయ‌డం ఈ సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యింది. దీంతో డైరెక్ట‌ర్ మ‌హాతో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసేందుకు కొంత మంది నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు. అయితే.. త‌ను మాత్రం మ‌రో డిఫ‌రెంట్ మూవీని అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మేట‌ర్ ఏంటంటే.. ఆయన ఒక మలయాళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఆ మలయాళ సినిమా పేరే మహేషింటే ప్రతీకారం. ఈ చిత్రానికి దిలీశ్ పోతన్ దర్శకత్వం వహించారు. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లతో పాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇందులో సత్యదేవ్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెలలో షూటింగును పూర్తి చేసుకోనుంది. మ‌రి.. ఈ సినిమా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story
Share it