తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పలువురు వ్యాపారవేత్తలపై జరిగిన ఐటీ దాడులను టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో.. ఆదివారం బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడ్లారు. ఐడీ దాడులు ఎవరిపై జరిగాయో వారికే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పోలవరం పనులు కట్టబెట్టారన్నారు. దీనిబట్టి చూస్తే ఎవరేంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

ఇంటర్‌పోల్‌ అధికారులు సీఎం జగన్‌ను త్వరలో అదుపులోకి తీసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో గతంలో సీబీఐ విచారణ కోరిన జగన్‌.. ఇప్పుడు వెనక్కి తగ్గడంలో ఆంత్యర్యమేంటని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

రాష్ట్రంలో వైసీపీ ఆరాచకత్వం పెట్రేగిపోతుందని, వైసీపీ నేతలు పలు సంస్థల నుంచి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే జగన్‌ ఢిల్లీ పర్యటనలు చెస్తున్నారు. ఢిల్లీ పెద్దల కాళ్ల మీద పడుతున్నారని ఆరోపించారు.

Newsmeter.Network

Next Story