జొమాటోకు కో-ఫౌండర్ రాజీనామా

తాజాగా ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  27 Sept 2024 3:30 PM
జొమాటోకు కో-ఫౌండర్ రాజీనామా

జొమాటో అంటె తెలియని వారు ఉండరు. పట్టణ ప్రాంతాల్లో ఈ ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌ ద్వారా.. నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టి తింటుంటారు. అయితే.. తాజాగా ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు, కంపెనీ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ఆకృతి చోప్రా రాజీనామా చేశారు. జొమాటో సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆమె సంస్థను వీడారని, తక్షణమే ఆమె రాజీనామా అమల్లోకి వస్తుందని జొమాటో సంస్థ పేర్కొంది.

కాగా.. ఆకృతి చోప్రా జొమాటోలో 2011 నుంచి ఉంటున్నారు. కీలకంగా పని చేశారు. ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌లో సీనియర్‌ మేనేజర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా కూడా సేవలందించారు. చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌గా ఆకృతి చోప్రా నియమితులయ్యారు. జొమాటోతో ఆమె ప్రయాణం దాదాపు 13 ఏళ్ల పాటు కొనసాగింది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆకృతి జొమాటో నుంచి విడిపోయారు.జొమాటోకు చెందిన గ్రాసరీ డెలివరీ విభాగమైన బ్లింకిట్‌ సీఈఓ అల్బీందర్‌ దిండ్సా భార్యే చోప్రా. కాగా.. ఆకృతి జొమాటోకు ఇప్పటి వరకు నియామకం అయిన ఐదో సహ వ్యవస్థాపకులు.

Next Story