పెరగనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషన్, ఏసీల ధరలు..!
TV, fridge, washing machine prices hikes. టీవీ, వాషింగ్ మెషన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేన్‌ఓవెన్ తదితర వైట్ గూ
By సుభాష్ Published on 8 Dec 2020 9:11 AM ISTటీవీ, వాషింగ్ మెషన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేన్‌ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే ఆకాశన్నంటనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచే నిర్ణయం తీసుకుంటున్నాయి. ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరుగుతుండటతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి.
అయితే వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15 నుంచి 40 శాతం మేరకు పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జింక్, అల్యూమినియం ధరలు గత ఐదు నెలల్లోనే 40 నుంచి45 శాతం మేర పెరిగాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎండీఐ కె మికల్ ధర 200 శాతం ఎగిసిపడింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30-40 శాతం మేర పెరిగాయి. మరో వైపు సముద్ర రవాణా 40-50 శాతం పెరిగింది.
వైట్ గూడ్స్ ధరలు 20 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొనం్నేళ్లలో ఇదే మొదటిసారి అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు సెప్టెంబర్ నెల నుంచే ధరలు పెరగాల్సి ఉంది. కానీ పండగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు పండగ సీజన్‌లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని ధరలు పెంచకుండా చేశాయి కంపెనీలు. ఇక ఇప్పుడు పండగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందరని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
అలాగే ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్-సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనుంది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే విధంగా సుంకాలను మూడేళ్లలో 8-10 శాతానికి పెంచాలనేది కేంద్రం ఆలోచన. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సంకం పెరుగుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం పెరగనున్నాయి. అలాగే సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు కూడా పెరగనున్నాయి. ప్యానెళ్ల ధరలను 20-25 శాతం మేర పెంచాయి.