ట్రాయ్‌ కొత్త రూల్స్.. సిగ్నల్స్ అందించలేకపోతే భారీ జరిమానా

టెలికామ్‌ సేవల్లో మరింత నాణ్యత కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 10:54 AM IST
trai, new rules,  no signals,  fine

ట్రాయ్‌ కొత్త రూల్స్.. సిగ్నల్స్ అందించలేకపోతే భారీ జరిమానా

టెలికామ్‌ సేవల్లో మరింత నాణ్యత కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు టెలికామ్‌ రెగ్యులటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ ను వెల్లడించింది. ఈ నిబంధనల ప్రకారం సిగ్నల్స్‌ను సంస్థలు అందించలేకపోతే వారికి భారీ జరిమానాలు ఎదురుకానున్నాయి. నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు కఠినతరం చేసినట్లు ఈ మేరకు ట్రాయ్ వెల్లడించింది. అన్నీ పరిశీలించిన తర్వాత ఈ కొత్త రూల్స్‌ను ప్రకటిస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ మేరకు వివరాలను ట్రాయ్‌ చైర్మన్ అనిల్‌ కుమార్ లాహోటి వెల్లడించారు.

ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం.. సిగ్నల్‌ సరిగ్గా అందించలేకపోతే యూజర్లకు ఆయా సంస్థలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని ఈ మేరకు ట్రాయ్‌ వెల్లడించింది. దీనికి 6 నెలల గడువు కూడా ఇచ్చింది. కొత్త అప్‌గ్రేడ్స్ ద్వారా వినియోగదారులకు నాణయమైన సేవలు అందుతాయని ట్రాయ్ భావిస్తోంది. ఒక వేళ ఎవరైనా నిబంధలనలను ఉల్లంఘిస్తే.. ఆయా సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని అనిల్ కుమార్ లాహోటి పేర్కొన్నారు.

ట్రాయ్ జారీ చేసిన కొత్త క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం, జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం సర్వీస్ ఆగిపోయినప్పుడు టెలికామ్ ఆపరేటర్లు చందాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తాన్ని రూ. 50వేలు నుంచి రూ.1 లక్షకు పెంచారు. గ్రేడెడ్ పెనాల్టీ విధానం ఆధారంగా జరిమానా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా విభజించారు. భారీ మొత్తంలో జరిమానాలు పెంచడంతో కొత్త రూల్స్‌పై టెలికామ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.

Next Story