కస్టమర్స్‌కు స్విగ్గి, జొమాటో షాక్.. ప్లాట్‌ఫామ్ చార్జీలు పెంపు
చాలా మంది ఆన్‌లైన్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 11:50 AM IST
కస్టమర్స్‌కు స్విగ్గి, జొమాటో షాక్.. ప్లాట్‌ఫామ్ చార్జీలు పెంపు
చాలా మంది ఆన్‌లైన్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. రెస్టారెంట్‌కు వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లోనే కూర్చొని.. క్షణాల్లో నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ పెడుతున్నారు. స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. స్విగ్గి, జొమాటో యాప్స్ తమ కస్టమర్స్‌కు షాక్ ఇచ్చాయి. ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏకంగా 20 శాతం మేర ప్లాట్ ఫామ్ చార్జీలను పెంచారు. ఢిల్లీ, బెంగళూరు వంటి డిమాండ్ ఉన్న నగరాల్లో.. ఇక ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.6గా వసూలు చేయనున్నారు. ఇప్పటి దాకా ఈ ఫీజు రూ.5 ఉండేది. ఇక స్విగ్గీ బెంగళూరులో తమ ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.7గా పేర్కొంది. రాయితీ తర్వాత దాన్ని రూ.6గా అందిస్తున్నట్లు పేర్కొంది.
2023 ఆగస్టులో ఈ తరహా ఫీజును తొలిసారి ప్రారంభించాయి. మొదట రూ.2గా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచుతూ వస్తున్నాయి. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లక్నో నగరాలకు ఈ పెంపును వర్తింపజేసింది. ఇక వేగవంతమైన డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తోంది. ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌లు ఈ తరహా ఫీజులకు తెరలేపాయి. ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఈ రెండు సంస్థలే ముందున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని మరింత ఎక్కువ చేసుకువాలనే ఉద్దేశంతో ఫీజులను పెంచుతున్నాయి. అయితే.. ప్లాట్‌ఫామ్ ఫీజుల పెంపు ద్వారా రోజుకు రూ.1.25 కోట్ల నుంచి రూ.1.25 కోట్ల ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.