మరింత పెరిగిపోతున్న ముఖేష్ అంబానీ సంపద

Mukesh Ambani enters $100-bn club.ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క రోజులోనే(సెప్టెంబర్ 3) 3.71 బిలియన్

By M.S.R  Published on  6 Sep 2021 1:55 PM GMT
మరింత పెరిగిపోతున్న ముఖేష్ అంబానీ సంపద

ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క రోజులోనే(సెప్టెంబర్ 3) 3.71 బిలియన్ డాలర్లు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఆయన సంపద భారీగా పెరిగిపోయింది. 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువతో బిలియనీర్ల ప్రత్యేక క్లబ్ లోకి ప్రవేశించడానికి దగ్గరగా ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ తన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ఆర్ఐఎల్ షేర్లు సోమవారం(సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద ఉన్నాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది. లోకల్‌ సెర్చి ఇంజిన్‌ జస్ట్‌ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది.

Next Story