తాను చేసిన అతిపెద్ద తప్పేంటో చెప్పిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో

మైక్రోసాఫ్ట్‌ సంస్థ కంపెనీ సీఈవో సత్యనాదెళ్ల ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  25 Oct 2023 7:30 AM GMT
microsoft ceo, satya nadella, wrong decision,

తాను చేసిన అతిపెద్ద తప్పేంటో చెప్పిన మైక్రోసాఫ్ట్‌ సీఈవో 

ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటి మైక్రోసాఫ్ట్‌ సంస్థ. ఈ కంపెనీ సీఈవోగా పనిచేస్తున్న సత్యనాదెళ్ల ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను బిజినెస్‌ ఇన్‌సైడర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఉన్న సమయంలో చేసిన అతిపెద్ద తప్పేంటో చెప్పుకొచ్చారు. మొబైల్‌ ఫోన్‌ వ్యాపారంలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీ నిష్ర్కమించడానికి బదులు దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల అంగీకరించారు.

అయితే.. మొబైల్‌ కేటగిరీలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ నుంచి గతంలో ఫోన్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వాటికి అనుకున్నంత ప్రజల నుంచి లభించలేదు. దాంతో.. మైక్రోసాఫ్ట్‌ సంస్థ వాటిని తయారు చేయడం నుంచి నిష్క్రమించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్లను ఇదే ప్రశ్నను అడడగ్గా ఆయన స్పందించారు. మైక్రోసాఫ్ట్‌ మొబైళ్ల తయారీ నుంచి నిష్క్రమించడానికి బదులు మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. తాను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో అదీ ఒకటి అని చెప్పుకొచ్చారు సత్యనాదెళ్ల. అయితే.. కంప్యూర్‌ మాదిరి కార్యకలాపాలకు మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ఫోన్‌ ద్వారా అవకాశం లభిస్తుందని భావించామని చెప్పారు. అందుకే మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ ఫోన్‌ను తీసుకొచ్చామని సత్యనాదెళ్ల చెప్పారు. ప్రజల నుంచి ఆ ఫోన్‌కు ఆదరణ లభించలేదని.. కానీ దాన్ని మరింత మెరుగు పరచాల్సిందని అభిప్రాయ పడ్డారు సత్యనాదెళ్ల. తద్వారా ఫోన్‌ కేటరిలో కంపెనీ మరింత ముందుండేదని సత్యనాదెళ్ల చెప్పారు.

కాగా.. సత్యనాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో స్టీవ్‌ బాల్మెర్‌ నుంచి బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఏడాదే నోకియా ఫోన్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన రూ.63వేల కోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్‌ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్‌లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది.

Next Story