రూ.16 లక్షల కోట్లు దాటేసిన జుకర్‌బర్గ్‌ సంపద

మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురించి అందరికీ తెలుసు.

By Srikanth Gundamalla  Published on  30 Sep 2024 2:45 PM GMT
రూ.16 లక్షల కోట్లు దాటేసిన జుకర్‌బర్గ్‌ సంపద

మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరు. తాజాగా ఆయన మరో రికార్డును అందుకున్నారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్‌ లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచారు. 200 బిలియన్‌ డాలర్లు మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌లో వివరాలను వెల్లడించింది. జుకర్ బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో 16.8 లక్షల కోట్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ తెలిపింది.

ఇక ఈ జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. 272 బిలియన్ డాలర్ల సంపద (రూ.22.7 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉ‍న్నారు. గతంలో నాలుగో స్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ వ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కి నెట్టి.. జుకర్ బర్గ్ నాలుగో స్థానానికి చేరుకున్నారు. కాగా.. లారీ ఎల్లిసన్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నారు.

బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌ టాప్‌-10 రిచెస్ట్ పర్సన్స్‌:


ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నాల్డ్ ఆర్నాల్ట్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, బిల్‌గేట్స్, లారీపేజ్‌, స్టీవ్‌ బామర్‌, వారెన్‌బఫెట్‌, పదో స్థానంలో సెర్జీబ్రిన్‌ ఉన్నారు.

Next Story