మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు

వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయ్.

By Srikanth Gundamalla  Published on  26 April 2024 10:15 AM GMT
may month, bank holidays, business,

మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు 

చాలా మంది వ్యాపారులు.. ఇతరులు ఎక్కువగా బ్యాంకుల్లో పనులు పెట్టుకుంటారు. అలాంటి వారి కోసం ఓ సమాచారం. వచ్చే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయ్. వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా కలిపి ఉన్నాయి. అయితే.. మరోవైపు మే నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవ్వనున్నారు. మే డే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, నజ్రుల్‌ జయంతి, అక్షయ తృతీయ వంటి రోజుల్లో కూడా సెలవులు వస్తున్నాయి. కొన్ని డేస్‌లో ఈ సెలవులు రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి కూడా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే బ్యాంకులకు వెళ్లాలనుకునే వారు ఆయా సెలవులను గుర్తుంచుకుని.. ముందుగా సేవ్ చేసుకున్న తర్వాతే అక్కడకు వెళ్లండి. తద్వారా బ్యాంక్‌కి వెళ్లకుండా ఆగిపోయి సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక మే నెలలో బ్యాంకులకు వస్తోన్న సెలవులను వరుసగా చూస్తే...

మే 1వ తేదీన బ్యాంకులకు సెలవు: మహారాష్ట్ర దినోత్సవం/ కార్మిక దినోత్సవం సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు

మే 5న ఆదివారం: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు

మే 8 బుధవారం : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని అన్ని బ్యాంకులకు సెలవు

మే 10 ‍‌శుక్రవారం: అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు హాలిడే

మే 11 రెండో శనివారం: దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి

మే 12 ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు

మే 16 గురువారం: రాష్ట్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు

మే 19 ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలీడే

మే 20 ‍‌సోమవారం: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలోని బ్యాంకులకు సెలవు

మే 23 ‍‌గురువారం: బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీడే

మే 25 నాలుగో శనివారం: దేశంలోని అన్ని బ్యాంక్‌లకు హాలీడే

మే 26 ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

Next Story